- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎక్సైజ్ అధికారుల ఆకస్మిక దాడులు.. ఐదు టన్నుల నల్ల బెల్లం సీజ్
దిశ, కడం: మండల కేంద్రంలోని పలు దుకాణాల్లో ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ కమిషనర్ నరసింహరెడ్డి ఆదేశాల మేరకు నిర్మల్ జిల్లా ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ అబ్దుల్ రజాక్ ఆధ్వర్యంలో కడెం మండల కేంద్రంలో మంగళవారం పలు దుకాణాల్లో ఎక్సైజ్ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ కిరాణా షాపు యజమాని షట్టర్‌లో గుడుంబా తయారీకి ఉపయోగించే ముడి సరుకు, నిషేధించిన 5 టన్నుల నల్ల బెల్లం, 3.5 క్వింటళ్ల పటికను సీజ్ చేశారు. కడెం మండలంలోని పాండాపూర్ గ్రామంలో నాటు సారా తయారీ చేస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అదుపులోకి తీసుకోవడం అసలు విషమం బయటపడిందని జిల్లా ఎక్సైజ్ అధికారి రజాక్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నాటుసారాపై నిషేధం ఉండటంతో ఎవరైనా సారా తయారు చేసిన, ముడి సరుకు నిర్వ ఉంచిన తమకు సమాచారం అందజేయాలని ప్రజలకు జిల్లా ఎక్సైజ్ అధికారి రజాక్ సూచించారు.