ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటా: ఎమ్మెల్యే పాయల్ శంకర్

by Mahesh |
ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటా: ఎమ్మెల్యే పాయల్ శంకర్
X

దిశ, ఆదిలాబాద్: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు తనవంతుగా చర్యలు తీసుకుంటానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. గురువారం జైనథ్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతులు నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు తరగతి గదుల సమస్య ఎదురు కాకుండా అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని రూ:13.50 లక్షల నిధుల వ్యయంతో నిర్మించడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు కల్పించడం, నిర్మాణంలో ఉన్న భవనాల పూర్తి చేసే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఉపాధ్యాయ ఖాళీల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఖాళీ పోస్టులలో విద్యా వాలంటరీలను నియమించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు బోయర్ విజయ్, అశోక్ రెడ్డి, రాందాస్, రమేష్ రెడ్డి, రాకేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed