పూరెడుపల్లి లో ‘పోడు’ పెద్ద పెద్ద వృక్షాలు నరికివేత

by Kalyani |
పూరెడుపల్లి లో ‘పోడు’ పెద్ద పెద్ద వృక్షాలు నరికివేత
X

దిశ, మంగపేట: మండలంలోని మల్లూరు సెక్షన్ పూరెడుపల్లి పంచాయతీ పరిధి 48 వ కంపార్ట్ మెంట్ అటవీ ప్రాంతంలో సమీప గ్రామాలకు చెందిన కొందరు అడవులను విచ్చలవిడిగా నరుకుతూ పోడు చేస్తున్నారు. అడవులను సంరక్షించాల్సిన అటవీశాఖ అధికారులు పోడు దారుల నుంచి ముడుపులు తీసుకుని అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పూరెడుపల్లి ఊర చెరువు నుండి రాళ్లకుంట వరకు అడవిని పోడు చేస్తూ పెద్ద పెద్ద చెట్లను గత 20 రోజులుగా యదేశ్చగా నరుకుతున్న అటవీ అధికారులు ఎందుకు చూడనట్లు వ్యవహరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పూరెడుపల్లి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రెండు నెలలుగా గ్రూపులుగా ఏర్పడి ఊర చెరువు నుండి రాళ్లకుంట వరకు ఉన్న అటవీ ప్రాంతంలో సుమారు 50 హెక్టార్ల మేరకు పోడు చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసిన అటవీ అధికారులు పోడు దారులతో లాలూచీ పడి వారిని ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

పోడు నిజమే.. నలుగురిపై కేసు నమోదు : ఎఫ్ బీ ఓ దివ్య

పూరెడుపల్లి 48 కంపార్ట్ మెంట్ లో పోడు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి 4 గురి పై కేసు నమోదు చేసినట్లు పూరెడుపల్లి ఎఫ్ బీ ఓ దివ్య తెలిపారు. రాళ్లకుంట పరిధి అటవీ ప్రాంతంలో సుమారు 7 హెక్టార్ల మేరకు పోడు కోసం చెట్లు నరికారని వారిని గుర్తించి కేసు నమోదు చేసి సెక్షన్ అధికారికి సమాచారం ఇచ్చినట్లు దివ్య తెలిపారు.

Next Story

Most Viewed