- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అబద్ధాన్ని సృష్టించారు.. దేవుడే మొట్టికాయ వేశారు: చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) ఒక అబద్ధాన్ని సృష్టించారని ఆ దేవుడే మొట్టికాయ వేశారని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CA Jagan Mohan Reddy) అన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ నేతలతో సమావేశమైన ఆయన కూటమి ప్రభుత్వ పాలనపై విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా బడ్జెట్ పెట్టలేకపోయారని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్(YSR Congress), తెలుగుదేశం(Teluguparty) పాలనకు మధ్య తేడాను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. తప్పులు చేస్తూ వైసీపీపై నెడుతున్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబు చేస్తున్న తప్పులను దేవుడు చూస్తున్నాడనేందుకు లడ్డూ వివాదమే ఉదాహరణమని చెప్పారు. తిరుమల లడ్డూపై విషప్రచారం చేశాని ఆరోపించారు. చంద్రబాబు ఒక అబద్ధాన్ని సృష్టిస్తారని, దాన్ని మార్కెటింగ్ చేయగల సమర్ధులున్నారని విమర్శించారు. చివరికి చంద్రబాబుకు దేవుడే మొట్టికాయ వేశారని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించారు.
‘‘రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి పెరిగింది. ప్రతి గ్రామం, నియోజకవర్గంలో జూదం, క్లబ్బులు పెరిగాయి. ఇసుక, మద్యంలో దోచుకుంటున్నారు. మా హయాంలో కంటే ఇసుక ఇప్పుడు ఎక్కువ ధర ఉంది. మనం చేసిన మంచి పని ఎక్కడికీ పోలేదు. ఎన్నికల్లో చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేకపోయా. రాజకీయాల్లో వ్యక్తిత్వం, విలువలు లేకపోతే చులకన అవుతాం. ఎన్నికల హామీలపై ప్రజల తరపున పోరాటం చేయండి. నేతలు, కార్యకర్తలను అండగా ఉంటా.’’ అని జగన్ భరోసా ఇచ్చారు.