‘రాజప్ప అంటే నాకు చాలా గౌరవం’.. మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

by Jakkula Mamatha |   ( Updated:2024-10-03 15:32:04.0  )
‘రాజప్ప అంటే నాకు చాలా గౌరవం’.. మంత్రి లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, పెద్దాపురం: పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చిన రాజప్ప అంటే నాకు చాలా అభిమానం, గౌరవం కూడా అని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. నేడు రాజప్ప విజయవాడలో లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా లోకేష్ రాజప్ప గురించి ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సీనియర్ నాయకుడుగా రాజప్ప చక్కని సేవలు అందిస్తున్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షం లో ఉన్నా రాజప్ప ఒకేలా ఉంటారని అన్నారు. ఎక్కడా కూడా గర్వం అనేది ఆయన డిక్షనరీలో ఉండదని అన్నారు. ఎప్పుడు నన్ను కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కానీ కలిసినా పెద్దాపురం అభివృద్ధి తాలూకు నిధులు మాత్రమే అడుగుతారని అన్నారు. ఇతర విషయాల జోలికి వెళ్లారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed