IRON DOME: ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ పవర్ తగ్గిందా?

by HARISH SP |
IRON DOME: ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ పవర్ తగ్గిందా?
X

ఇరాన్ ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 2 పేరిట 181 ఫతాహ్1, ఖైబర్ షేకన్ మిసైళ్లను ఇజ్రాయెల్ పైకి ప్రయోగిస్తే.. వీటిలో దాదాపుగా కొన్ని మినహా అన్నింటినీ ఐరన్ డోమ్ ( అడ్డుకున్నది. అయితే, ఇరాన్ మాత్రం 96 శాతం టార్గెట్లను తమ మిసైళ్లు పేల్చేశాయని ప్రకటించినా.. ఇజ్రాయెల్ మాత్రం వాటిని ఖండించింది. ఇరాన్ తన అమ్ములపొదిలో అత్యంత ఖరీదైన మిసైళ్లను ప్రయోగించినా వాటిని ఐరన్ డోమ్ సమర్థంగా అడ్డుకున్నదని వాటిలో కొన్నింటిని మినహా అన్నింటినీ అడ్డుకున్నదని మీడియాకు వెల్లడించింది. అయితే ఆ కొన్నింటిని ఐరన్ డోమ్ ఎందుకు అడ్డుకోలేకపోయింది అన్న వాదనకు ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు సమాధానమిస్తూ.. ఐరన్ డోమ్ లో వినియోగించే ఒక్కో రాకెట్ ఖర్చు దాదాపుగా 50వేల డాలర్లు ఉంటుందని.. లక్షిత ప్రాంతాలనుంచి దూరంగా వెళ్లే రాకెట్లను ఉద్దేశపూర్వకంగానే వదిలేస్తామని చెప్పారు. గాజా నుంచి ప్రయోగించిన రాకెట్లు ఒక్కోటి 5వేల డాలర్లు ఖరీదు ఉంటే వాటిని అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ ఒక్కో మిసైల్ కి 50వేల డాలర్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. అందుకే జన, ప్రాణ నష్టం లేని ప్రాంతాలవైపు వెళ్లే రాకెట్లను టార్గెట్ చేయడం వృథా అని అక్కడి అధికారులు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed