- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP leaders : ఆగిపోయిన సదర్మాట్ రోడ్డు పనులు..
దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం లోని మేడంపల్లి గ్రామ చివరలో ఉన్న సదర్మాట్ ఆయకట్టును వీక్షించేందుకు సందర్శకులు జగిత్యాల, నిజామాబాద్, మంచిర్యాల జిల్లా నుండి వస్తువుంటారు. మేటపల్లి వెళ్లే రోడ్డు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం సదర్మాట్ వరకు రోడ్డు పూర్తిగా చెడిపోవుడంతో అక్కడి ప్రజలకు రోడ్డుపై వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారని, స్థానిక ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ కు విన్నవించగా ఎమ్మెల్యే స్పందించి ఆ బీటీ రోడ్డు పనులకు వేసవికాలంలో భూమి పూజ చేశారు.
సదరు కాంట్రాక్టర్ రోడ్డు పనులు చేస్తూ అవసరం లేనిచోట ఓపెన్ కాల్వట్ కట్టారని, అవసరం ఉన్న చోట కాల్వట్ నిర్మించలేదని పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సదర్మాట్ ఆయకట్టులో ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి సదర్మాట్ ఆయకట్టు నుంచి సుర్జాపూర్ గ్రామం వరకు ఫిల్టర్ బెడ్ పైపులైన్ రోడ్డు పక్కన వేశారు. ఆ పైపులైన్ కు అక్కడ వాటర్ ఎర్వాల్స్ ఏర్పాటు చేస్తూ ప్రమాదలు సంభవించకుండా రింగ్ లను ఏర్పాటు చేశారు. కానీ నిర్మాణం చేపత్తుతున్న బీట్ రోడ్డు పక్కన ఉన్న ఎర్వాల్స్ కు రింగ్ ఏర్పాటు చేయకపోవడంతో ఎర్వాల్స్ గుంతలు ఏర్పడి ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్న అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్ పట్టించుకోకుండా వున్నారు అని విమర్శించారు ఉన్నాయి.
కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇంట్లోకి వరద నీరు..
సదర్మాట్ బీట్ రోడ్డు చేపడుతున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఇంట్లోకి వరద నీరు చేరిందని పలువురు ఆరోపించారు. శనివారం రాత్రి 3 గంటల ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి మండలంలోని సుర్జాపూర్ గ్రామానికి చెందిన నీలం నర్సయ్య ఇంట్లోకి, గొర్రెల పాకలకు భారీగా వరద నీరు చేరింది. రాత్రి అంతా కుటుంబ సభ్యులు మెలుకువతో ఉండి పోయారు. సదరు కాంట్రాకర్ అవసరం లేని వద్ద కల్వట్ నిర్మించవద్దు అని తెలిపినా కల్వట్ నిర్మించారని స్థానికులు తెలిపారు. మరో కల్వట్ నిర్మిస్తామని చెప్పి కల్వట్ నిర్మించకుండా, బిట్ రోడ్డు పనులు కూడా నిలిపివేశారని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఇకనైనా కల్వట్ నిర్మించి వర్షపు వరద నీరు రాకుండా అధికారులు చూడాలని ఆయన అన్నారు.