కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి

by Shiva |
కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతి
X

దిశ, భీమిని: కుక్కల దాడిలో చుక్కల దుప్పి మృతిచెందిన ఘటన నెన్నేల మండలం జెండా వెంకటాపూర్ లో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెంకటాపూర్ అటవీ ప్రాంతం నుంచి ఉదయం 8 గంటల ప్రాంతంలో గ్రామ పొలిమేరల్లోకి దాహం తీర్చుకునేందుకు ఓ చుక్కల దుప్పి వచ్చింది. ఈ క్రమంలో దుప్పిని కుక్కలు పసిగట్టి దాదాపు 30 కుక్కలు దుప్పి పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాయని కుక్కలను చెదరగొట్టి దుప్పి ని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని స్థానికులు తెలిపారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని దుప్పికి పోస్టుమార్టం నిర్వహించారు. గ్రామాల్లో కుక్కల బెడద తీవ్రంగా ఉందని గుంపులుగా సంచరిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని గ్రామస్థులు ఫారెస్ట్ అధికారులకు తెలిపారు.

Advertisement

Next Story