- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్యాంప్ ఆఫీసుకు వాస్తు దోషం...? ఇక్కడికి రావడమే బంద్ జేసిన ఎమ్మెల్యే
దిశ, మంచిర్యాల టౌన్: మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే దివాకర్ రావు క్యాంప్ ఆఫీస్ కు నిత్యం రాకపోవడంతో క్యాంప్ ఆఫీస్ కాస్త బోసి పోయి కనిపిస్తుంది. క్యాంప్ ఆఫీస్ ప్రాంగణంలో ఎటువంటి బోర్డు గానీ క్యాంప్ ఆఫీస్ అని తెలియజేసే సూచికలు కూడా లేకపోవడం విడ్డూరం. ఆఫీస్ కి వాస్తు దోషం ఉందని మళ్లీ వచ్చే ఎలెక్షన్స్ లో కొడుకు విజిత్ రావు ఎమ్మెల్యేగా గెలవాలంటే సొంత ఇంట్లోనే ఉండడం మంచిది అనే విషయాన్ని పలువురు ఎమ్మెల్యే దివాకర్ రావుకు చెప్పడంతో ఆ ఊహా గాణల్లో ఉన్న ఎమ్మెల్యే దివాకర్ రావు తనతోపాటు తన సిబ్బందిని, ఆఫీస్ ని కూడా సొంత ఇంట్లోనే కొనసాగిస్తున్నారు.
ఎమ్మెల్యేలు నిత్యం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి చొప్పున వెచ్చించి ప్రతి నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను నిర్మించింది. అందులోనే ఎమ్మెల్యేలు ఉంటే నియోజకవర్గ ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా ఎమ్మెల్యేను కలిసి విన్నవించుకునే అవకాశంతోపాటు ఎమ్మెల్యేకు సైతం అధికారులను క్యాంప్ ఆఫీస్ కి పిలిపించుకుని సమస్యలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండేది. కానీ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు, అధికారులు, ఇతర పనుల కోసం వచ్చేవాళ్లకు ఎమ్మెల్యే సొంత ఇల్లే ఆఫీస్ గా మారింది.
అనుకున్నా సమయానికన్నా ముందే క్యాంప్ ఆఫీస్ నిర్మాణం పూర్తి అయినప్పటికీ పలు రాజకీయ విమర్శల మధ్య ఆలస్యంగా గృహ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఇప్పటి వరకు క్యాంప్ ఆఫీస్ కు ఎపుడో ఒకసారి ఆలా వెళ్లి ఇలా వస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. పోయిన ఏడాది జులై నెలలో కురిసిన అకాల వర్షాలకు ఎమ్మెల్యే ఉండే సొంత ఇంటి ప్రాంతం అంతా వరదలు వచ్చి నీళ్లు చేరడంతో ఆ రెండు మూడు రోజులు మాత్రమే కుటుంబ సభ్యులతో క్యాంప్ ఆఫీస్ లో తలదాచుకుని వరద నీళ్లు పోయి ఇంటి దగ్గర అంత శుభ్రం అయినాక వెళ్లి మళ్లీ సొంత ఇంట్లోనే చేరారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే దివాకర్ రావు అపోహలు మాని ప్రభుత్వం నిర్మించిన క్యాంప్ ఆఫీస్ ను వినియోగించుకోవాలని, దానివల్ల నియోజక వర్గ ప్రజలకు, అధికారులకు మేలు జరుగుతుందని పలువురు ఆకాంక్షిస్తున్నారు.