చిన్నపొర్లలో వ్యక్తిని కొట్టి చంపిన కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేశాం: ఎస్పీ

by Anjali |
చిన్నపొర్లలో వ్యక్తిని కొట్టి చంపిన కేసులో ఏడుగురిపై కేసు నమోదు చేశాం: ఎస్పీ
X

దిశ, వెబ్‌డెస్క్: నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలో నిన్న దారుణం చోటుచేసుకుంది. చిన్నపొర్ల గ్రామంలో భూతగాదాల కారణంగా సంజయ్ అనే ఓ వ్యక్తిని అందరూ చూస్తుండగానే కర్రలతో విచక్షణరహితంగా చితకబదారు. సంజయ్ తల్లి తన కొడుకును కొట్టవద్దని ఎంత ఆపే ప్రయత్నం చేసినా.. ఫలితం లేకపోయింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సంజయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశామని తాజాగా ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. ఇప్పటివరకు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఒక నిందితుడు పరారీలో ఉన్నాడని, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. ఏ1 నిందితుడు ఉస్మానియాలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించిన ఘటన స్థలానికి వెళ్లకుండా నిర్లక్ష్యం వహించారని ఎస్సైని సస్పెండ్ చేశామని అన్నారు. గ్రామస్థుల సమాచారం ప్రకారం.. రెండుమూడేళ్లుగా భూతగాదాలు జరుగుతున్నాయని అన్నారు. చాలాసార్లు కుల పెద్దల దగ్గర పంచాయితీ జరిగిందని చెప్పారు. గతేడాది ఆక్రమణ కేసు కూడా నమోదు చేశామన్నారు.

Advertisement

Next Story

Most Viewed