Sp : రాథోడ్ శంకర్ కుటుంబానికి అండగా ఉంటాం

by Sridhar Babu |
Sp : రాథోడ్ శంకర్ కుటుంబానికి అండగా ఉంటాం
X

దిశ, ఆసిఫాబాద్ : ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాథోడ్ శంకర్ కుటుంబానికి అండగా ఉంటామని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు భరోసా ఇచ్చారు. ఆదివారం సీర్పూర్ టీ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ శంకర్ స్వగ్రామమైన కెరమెరి మండలానికి వెళ్లి ఆయన శంకర్​ మృతదేహంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. శంకర్ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన ఆర్థిక సహాయంతో పాటు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎస్పీ వెంట రిజర్వుడు ఇన్స్పెక్టర్ అడ్మిన్ పెద్దన్న, వాంకిడి సీఐ సత్యనారాయణ ఉన్నారు.

Advertisement

Next Story