SP Gaush Alam: భాష అభివృద్ధికి కాళోజీ చేసిన కృషి అనిర్వచనీయం

by Aamani |
SP Gaush Alam: భాష అభివృద్ధికి కాళోజీ చేసిన కృషి అనిర్వచనీయం
X

దిశ, ఆదిలాబాద్ : ప్రజా కవి, సాహితీవేత్త, భాషా అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు కాళోజీ నారాయణరావు కృషి మరువలేనిదని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం అన్నారు. సోమవారం జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పోలీసు ముఖ్య కార్యాలయంలో కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు భాషా అభ్యున్నతికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి అని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తన కలంతో ఎంతగానో ఆకట్టుకున్నారని అన్నారు. ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ భాషా దినోత్సవం గా ప్రకటించి గౌరవించిందని తెలిపారు. తెలుగు, మరాఠీ,ఉర్దూ, హిందీ భాషల నందు సాహిత్యాన్ని రచించిన వ్యక్తి కాళోజీ నారాయణరావు అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, డీఎస్పీ పోతారం శ్రీనివాస్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెంకటి తదితరులు పాల్గొన్నారు.

గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి..

జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణ నిర్వహించుకోవాళని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక సెంట్రల్ గార్డెన్ లో హిందూ ఉత్సవ సభ్యులు, గణపతి నవరాత్రి ఉత్సవ మండప సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. గణపతి మండప సభ్యులు గణపతి మండపాల వద్ద 24 గంటలు సభ్యులు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. అదేవిధంగా గణపతి మండపాల వద్ద రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలనీ, రాత్రి సమయాల్లో జంతువులు ప్రవేశించకుండా అడ్డును ఏర్పాటు చేయాలనీ, అగ్ని ప్రమాదం సంభవిస్తే ముందస్తు జాగ్రత్త చర్యల్లో తగినంత నీరు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, సమాచారం అందించేవారు 8712659906 ఈ నెంబర్ కు తెలియజేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఆపరేషన్ బి సురేందర్ రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు సునీల్ కుమార్, కరుణాకర్, ఫణిధర్, ప్రణయ్ కుమార్, శ్రీనివాస్, ఎస్ఐలు ముజాహిద్, విష్ణువర్ధన్, హిందూ ఉత్సవ సభ్యులు బొంపల్లి హనుమండ్లు, సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు ప్రమోద్ కుమార్ కత్రి, పెద్దలు కమల్ కిషోర్ అగర్వాల్, గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed