- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే ఇదంతా.. బైడెన్, హ్యారిస్ పై ట్రంప్ విమర్శలు
దిశ, నేషనల్ బ్యూరో: ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లో తనపై జరిగిన హత్యాయత్నంపై ట్రంప్ మరోసారి స్పందించారు. ఫ్యాక్స్ న్యూస్ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పై విరుచుకుపడ్డారు. వారిద్దరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లే తనపై ఈ దారుణం జరిగిందని ఆరోపించారు. డెమొక్రాట్లు తీవ్రమైన పదజాలాన్ని వాడుతున్నారని మండిపడ్డారు. వారి అసత్యాలు నమ్మిన నిందితుడు తనపై కాల్పులు చేయేందుకు ప్రయత్నించాడని ఆరోపించారు. బైడెన్, హ్యారిస్ మాటలు ప్రజాస్వామ్యానికే ముప్పు అని అభిప్రాయపడ్డారు. వారు దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆవేదని వ్యక్తం చేశారు. రెచ్చగొట్టేలా తాను కూడా మాట్లాడగలనని.. కానీ అలా చేయనని అన్నారు. అలానే, కొన్ని మీడియాసంస్థలపైనా విమర్శలు గుప్పించారు. కొన్ని సంస్థలు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ట్రంప్ పై హత్యాయత్నం
ఫ్లోరిడా వెస్ట్ పామ్ బీచ్‌లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా.. నిందితుడు ర్యాన్ వెస్లీ రౌత్ ఏకే 47 రైఫిల్‌తో సంచరించాడు. ఇది గమనించిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు నిందితుడిపై కాల్పులు జరిపారు. దీంతో అతడు ఓ ఎస్‌యూవీలో పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. రౌత్ ని అదపులోకి తీసుకున్నారు.