- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
BRS: మీకు ఈ విషయం తెలుసా..? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ట్వీట్

దిశ, వెబ్ డెస్క్: అసలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా? అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(BRS Leader RS Praveen Kumar) ప్రశ్నించారు. కొత్త ఏఈఈల వేతనాలపై(AEE Salaries) ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. పబ్లిక్ సర్వీస్ కమిషన్(Public Servies Commission) ద్వారా ఎంపికైన ఇంజనీర్లకు గత నాలుగు నెలలుగా జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్నరు! అని, మంత్రులు మాత్రం రూ.32000 ప్లేటు మీల్స్ సుష్టుగా ఆరగిస్తున్నారని దుయ్యబట్టారు.
అలాగే స్వయానా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) ఫోన్ చేసి చెప్పినా అధికారులు ఖాతరు చేయడం లేదంటే పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవాలని విమర్శించారు. అంతేగాక కాంగ్రెస్ మార్క్ 10 శాతం కమీషన్లు సమర్పించి పనులు చేయించుకొనే స్థోమత ఈ చిరుద్యోగులకు లేదని, కనీసం భయ్యాలు- భాబీల మాఫియాను కలిసి పని చేయించుకోవడానికి సరైన లింకు కూడా దొరకడం లేదని ఈ తెలంగాణ బిడ్డలు బాధ పడుతున్నారు! అని ఎద్దేవా చేశారు. ఇక మీకు ఈ విషయం తెలుసా? అంటూ.. ఆర్ఎస్పీ, తెలంగాణ సీఎస్ శాంతి కుమారి(Cs Shanthi Kumari), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని ట్యాగ్ చేశారు.