- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలి..
దిశ, తాండూర్ : సింగరేణిలో ప్రతిరోజు కనీసం 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తిని చేయాలని సింగరేణి సీ అండ్ ఎండీ శ్రీధర్ అన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో గురువారం సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జి.ఎంలతో ఉత్పత్తిపై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీ అండ్ ఎండీ మాట్లాడుతూ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగిందని, దీంతో బొగ్గుకు డిమాండ్ పెరిగిందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఏరియా ల వారిగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించి రవాణా చేయాలని ఆదేశించారు. ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలంటే ప్రతిరోజు 17 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగించాలని సూచించారు.
మార్చి నెల నుంచి వరుసగా నాలుగు నెలల పాటు ఇదే ఒరవడి కొనసాగించాలన్నారు. తద్వారా వచ్చే ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన 750 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్య సాధనకు గట్టి పునాది ఏర్పడుతుందన్నారు. వివిధ ఏరియాల్లో పెండింగ్లో ఉన్న భూసేకరణ, పునరావాస పనులు మరింత వేగవంతం చేసి రెవెన్యూ, అటవీశాఖ అధికారుల సమన్వయంతో సకాలంలో పనులు పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్లు ఎన్. బలరామ్ (ఫైనాన్స్ అండ్ పర్సనల్), డైరెక్టర్ (ఈ అండ్ ఎం) సత్యనారాయణ రావు, ఎన్.వి.కె. శ్రీనివాస్ (ఆపరేషన్స్), జి. వెంకటేశ్వర్ రెడ్డి (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్), అడ్వెజర్లు డి.ఎన్. ప్రసాద్ (మైనింగ్), సురేంద్ర పాండే (ఫారెస్ట్రీ), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ జె.ఆల్విన్, జీఎం (కోఆర్డినేషన్) సురేశ్, జీఎం. (సీపీపీ) సి.హెచ్.నరసింహారావు, జీఎం. సూర్యనారాయణ (మార్కెటింగ్) తదితరులు పాల్గొన్నారు.