ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

by Mahesh |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
X

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కల్వరి చర్చి సమీపంలో ఇవాళ తెల్లవారు జామున 3 గంటలకు రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెల్లంపల్లి వైపు వస్తున్న పాల వ్యాను అద్భుతప్పి జాతీయ రహదారి రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో మల్లేష్, భద్ర అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ తరలించారు. మృతి చెందిన వ్యక్తుల్ని మందమర్రి‌కి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు కాసిపేట పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed