- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బీఆర్ఎస్ పార్టీలో మహిళలకు తీవ్ర అన్యాయం : ఎమ్మెల్యే రేఖానాయక్
దిశ, జన్నారం: బీఆర్ఎస్ లో మహిళలకు టిక్కెట్ల పంపిణీలో తీరని అన్యాయం జరిగిందని, ఓ బంజార మహిళగా తనకు టిక్కెట్ ఇవ్వకుండా కుట్ర చేశారని, ఖచ్చితంగా పోటీలో ఉంటానని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గత ఆరు నెలల నుంచే తన మీద కుట్ర జరుగుతుందన్నారు.
తాను ఎలాంటి భూ కబ్జాలు, అవినీతికి పాల్పడలేదని, తనను కాదని ఎస్టీ కాని, నియోజకవర్గానికి సంబంధమే లేని వ్యక్తికి టిక్కెట్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. తొమ్మిదేళ్లుగా ఎల్లప్పుడు తాను ప్రజల మధ్యనే ఉన్నానని, తనకు జరిగిన అన్యాయన్ని ప్రజలందరికీ వివరించి ఖానాపూర్ లో తన సత్తాను చాటుతానని రేఖానాయక్ అన్నారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసే విషయం త్వరలోనే ప్రకటిస్తానని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యం సతీష్, తదితరులు ఉన్నారు.