- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
tribal villages : గిరిజన పల్లెలకు వరం.. పీఎం జుగా..
దిశ ప్రతినిధి, నిర్మల్ : పీఎం జుగా ( ప్రధానమంత్రి జన్ జాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్) పథకం అడవుల్లో నివసించే ఆదిమ గిరిజనులకు వరంగా మారనుంది. కొండకోనల్లో కనీస వసతులకు దూరమై.. స్వాతంత్రం సిద్ధించిన నాటి నుంచి కనీస కరెంటు సౌకర్యానికి నోచుకోని ఆదిమ గిరిజన పల్లెలకు ఈ పథకం కొత్త వెలుగులు తెచ్చిపెట్టనుంది. సత్వరమే ప్రతిపాదనలు పంపితే వచ్చే ఏడాదిలోగా దట్టమైన అడవులు కొండకోనల్లో నివసిస్తున్న వేలాది గిరిజన కుటుంబాలకు వరం కానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న సుమారు 300 అటవీ గ్రామాలకు ఈ పథకం కింద అనేక సౌకర్యాలు సమకూరనున్నాయి.
ప్రధానంగా విద్యుత్ సమస్యకు మోక్షం...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లాగా పేరు ఉంది. అందులోనూ ఆదిమ గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ జిల్లాలో దశాబ్దాలుగా సౌకర్యాలకు నోచుకోలేని ఆదిమ గిరిజన గూడేలు, తండాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వందలాది గ్రామాలను అభివృద్ధి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి రిజర్వ్ ఫారెస్ట్ ఇబ్బందిగా వస్తున్నది. అటవీ గ్రామాల్లో ఏ పని చేయాలన్నా కచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ రిజర్వు ఫారెస్ట్ అనుమతులు తప్పనిసరి. రోడ్ల నిర్మాణాలకే 50 ఏళ్లకు పైగా పట్టింది. విద్యుత్ సరఫరా జటిలమైన సమస్యగా ఇప్పటికీ అలాగే ఉంది. ఈ సమస్యకు పీఎం జుగా పథకం వరంగా మారిందనడంలో సందేహం లేదు. ఈ పథకం కింద మంచినీటి సరఫరా, పాఠశాలల నిర్మాణం, గ్రామ పారిశుధ్యం, గ్రామీణ వైద్యం ఇంటి నిర్మాణాలు సహా విద్యుత్ సరఫరా కీలకంగా ఉన్నాయి. మిగతా అన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ విద్యుత్ సరఫరా విషయంలో కరెంటు లైన్లు వేయడం అడవి ప్రాంతాల్లో ఇబ్బందికరంగా ఉండేది. తాజా పథకంతో విద్యుత్ లైన్ ల ఏర్పాటు పూర్తిస్థాయిలో మెరుగుపడునుంది.
కేంద్రానికి ప్రతిపాదనలు...
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పీఎం జుగా కింద చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి ప్రభుత్వ శాఖలు ప్రతిపాదనలు పంపాయి. ముఖ్యంగా విద్యుత్ శాఖ ద్వారా అటవీ గ్రామాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సిన ఎల్ టి లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలకు సంబంధించి ప్రతిపాదనలు పంపారు నిర్మల్ జిల్లాలో 45 గ్రామాలను గుర్తించారు. ఈ జిల్లాలోని కడెం, పెంబి, దిలావర్పూర్, మామడ, కుబీర్, ముధోల్, లోకేశ్వరం, తానురు, నిర్మల్ రూరల్, సారంగపూర్, నర్సాపూర్ జి, మండలాలను గుర్తించి ఆయా మండలాల పరిధిలో ఉన్న గ్రామాలను ఎంపిక చేశారు. అలాగే సోలార్ పవర్ కు సంబంధించి పైలెట్ ప్రాజెక్టు కింద పెంబి మండలంలోని రాగి దుబ్బ గ్రామాన్ని ఎంపిక చేశారు. ఈ జిల్లాలో స్వాతంత్రం వచ్చిన నుంచి కనీస కరెంటు సౌకర్యం లేని మూడు గ్రామాలకు కూడా ఈ పథకం కింద విద్యుత్ సరఫరా జరగనుంది. ఉమ్మడి జిల్లాలోని ఆసిఫాబాద్ మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లాల ఆదిమ గిరిజన గూడెం లు, దట్టమైన అడవుల్లో ఉన్న ఇతర గిరిజన తెగలు లంబాడా తండాలకు శాశ్వత విద్యుత్ సమస్య పరిష్కారానికి నోచుకోనుంది.