- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాంగ్రెస్ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు : ఎమ్మెల్యే దివాకర్ రావు
దిశ, మంచిర్యాల టౌన్ : అక్రమంగా సంపాదించిన డబ్బులతో పాదయాత్రలు చేస్తున్న కాంగ్రెస్ నేతలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. ఆదివారం మంచిర్యాలలోని పద్మనాయక ఫంక్షన్ హాలులో బీఆర్ఎస్ జిల్లా ఇంచార్జి నారదాసు లక్ష్మణ్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు అక్రమంగా సంపాదించిన డబ్బుతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా ప్రేమ్ సాగర్ రావు ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 3వేల మందికి ఇంటి నిర్మాణం కోసం పట్టాలు ఇచ్చి భూమి చూపించకుండా పేదలను మోసం చేసిన చరిత్ర మాజీ ఎమ్మెల్సీ దేనని మండిపడ్డారు.
ప్రజాప్రతినిధి ముసుగులో పేకాట క్లబ్బులు నిర్వహించడమే కాకుండా అవినీతి దందాలు చేశారన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో మంచిర్యాల జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న తమపై అసత్య ప్రచారాలు చేయడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. తగిన సమయంలో ప్రజలే కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెప్తారన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఐక్యతతో పనిచేసి కాంగ్రెస్ నాయకుల దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు విజిత్ రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, సహకార సంఘ చైర్మన్ సందెల వెంకటేష్, నాయకులు పల్లె భూమేష్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.