కేసీఆర్ మాయ మాటలను నమ్మే పరిస్థితిలో జనం లేదు: మంత్రి సీతక్క హాట్ కామెంట్స్

by Shiva |   ( Updated:2024-05-03 06:31:01.0  )
కేసీఆర్ మాయ మాటలను నమ్మే పరిస్థితిలో జనం లేదు: మంత్రి సీతక్క హాట్ కామెంట్స్
X

దిశ, సారంగాపూర్: రాష్ట్రంలో కేసీఆర్ మాయ మాటలను నమ్మే పరిస్థితిలో జనం లేరని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ ఆమె ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండల పరిధిలోని పలు గ్రామాలలో ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ మేరకు ఆలూరు, మలక్ చించోలి, బీరవెల్లి గ్రామాల్లో డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావుతో కలిసి ఆలూరులో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రం బీఆర్ఎస్ పార్టీ ఉండబోదని అన్నారు.

మాజీ సీఎం కేసీఆర్‌ మాయ మాటలను ప్రజలు స్థితిలో లేరని స్పష్టం చేశారు. దేశం కోసం గాంధీ కుటుంబం సర్వస్వం త్యాగం చేసిందని, ఆ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌ గాంధీని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కి 15 సీట్ల కట్టబెట్టాలని కోరారు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే ధరల నియంత్రణ ఉంటుందని అన్నారు. మోదీ ప్రధాని కాక ముందు రూ.25 వేలు ఉన్న తులం బంగారం నేడు రూ.85 వేలకు పెరిగిందని అన్నారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచారని, ఎన్నికలు రాగానే రూ.వంద తగ్గించారని ఎద్దేవా చేశారు.

మోడీ పాలనలో ప్రజలకు చేసింది ఏమి లేదని, కేవలం కార్పొరేట్ కంపెనీలకు లాభం చేశారని మండిపడ్డారు. ఏది ఏమైనా.. ఆదిలాబాద్ ఉమ్మడి పార్లమెంటు స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి, దశరథ్ రాజేశ్వర్, పార్టీ మండలాధ్యక్షుడు బొల్లోజీ నర్సయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ రాజమొహమ్మద్, ఎంబడి రాజేశ్వర్, అల్లూరి మల్లారెడ్డి, అల్లూరి వేణి, నారాయణ్ రెడ్డి, సుభాష్ రెడ్డి, తేజునాయక్, పోతారెడ్డి, ముత్యం‌రెడ్డి, విలాస్‌రావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed