Flood : పొంగిపొర్లుతున్న వాగులు..ఇబ్బందులు పడుతున్న ప్రజలు

by Aamani |
Flood : పొంగిపొర్లుతున్న వాగులు..ఇబ్బందులు పడుతున్న ప్రజలు
X

దిశ,బెజ్జూర్ : బెజ్జూర్ మండలంలో వాగులు ఓర్రెలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బెజ్జూరు మండలంలో రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. బెజ్జూర్ మండలంలోని కృష్ణ పల్లి శిష్మీర్ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దీంతో ఈ ప్రాంతానికి వెళ్లలేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. బెజ్జూర్ మండలంలోని తలాయి, తిక్క పల్లి ,భీమారం గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి.బెజ్జూరు మండలంలోని ముగవెల్లి, సోమేని, తలై,తిక్కపల్లి, పాత సోమేని, గొర్రె గూడెం, పాపన్నపేట, కోయ పల్లి, చింతలపల్లి, నాగపల్లి, తదితర గ్రామాల చెట్టు ప్రాణహిత నది వరద రావడంతో చుట్టూ నేరుచేరి ఇబ్బందులు పడుతున్నారు.

ప్రాణహిత నది ఒకవైపు రైతులను పరేషాన్ చేస్తుండగా మరోవైపు వాగులు వంకలు ఉప్పొంగి రవాణా వ్యవస్థ స్తంభించిపోతుంది. ప్రాణహిత బ్యాక్ వాటర్ తో పంటలు నీటిలో మునిగిపోయి రైతాంగం ఆందోళన చెందుతోంది. వేసిన పత్తి సోయాబీన్ పంటలు నీట మునగడంతో రైతులు పెట్టుబడి నీటిలో కలిసిపోతుందని మండల రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ప్రతినిధులు స్పందించి బెజ్జూర్ మండలంలో ప్రాణహిత బ్యాక్ వాటర్ వల్ల నీట మునిగిన పంట నష్టపరిహారం చెల్లించాలని, వాగులు పై వంతెనలు నిర్మించాలని మండల వాసులు కోరుతున్నారు.

Advertisement

Next Story