ఔట్ సోర్సింగ్ స్పాట్ బిల్లర్ పై దాడి

by Sumithra |
ఔట్ సోర్సింగ్ స్పాట్ బిల్లర్ పై దాడి
X

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విద్యుత్తు బిల్లులు కొట్టడానికి వెళ్లిన ఔట్ సోర్సింగ్ స్పాట్ బిల్లర్ పై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన శనివారం జరిగింది. పూర్తి వివరాల ప్రకారం బెల్లంపల్లి పట్టణంలోని శేషగిరినగర్లో బిల్లులు కొట్టడానికి శనివారం స్పాట్ బిల్లర్ రాజు ఓ ఇంటికి వెళ్లాడు. బిల్లులు యంత్రంతో కొడుతున్న సమయంలో వృద్ధురాలు వచ్చి విద్యుత్ బిల్లు అధికంగా వచ్చిందంటూ అసభ్యకరంగా మాట్లాడి, గొడవ పడింది. అంతే కాకుండా రాజు దగ్గర ఉన్న బిల్లుయంత్రాన్ని కూడా లాక్కుంది. ఇదే క్రమంలో పక్కనే ఉన్న ఆమె కుటుంబసభ్యుడు గద్దల సుదర్శన్ అనే వ్యక్తి వచ్చి రాజుపై దాడి చేశాడు. దీంతో విద్యుత్తు సిబ్బంది తనపై జరిగిన దాడి గురించి బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story