రెండవ రోజు బ్రహ్మచారినిగా బాసర అమ్మవారు

by Kalyani |   ( Updated:2023-10-16 10:06:57.0  )
రెండవ రోజు బ్రహ్మచారినిగా బాసర అమ్మవారు
X

దిశ బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో కొనసాగుతున్న శ్రీ శారదీయ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. రెండవ రోజు బాసర అమ్మవారు బ్రహ్మచారిని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.

బ్రహ్మచారిని అమ్మవారి విశిష్టత

అమ్మవారి అవతారాల్లో రెండో అవతారం బ్రహ్మచారిణీ.

గురువు వద్ద బ్రహ్మచర్యాశ్రమంలో తోటి విద్యార్థినులతో ఉండే అమ్మవారి అవతారం. నవదుర్గల్లో రెండో అవతారమైన బ్రహ్మచారిణీ దేవిని నవరాత్రుల్లో రెండవ రోజు పూజిస్తారు. కుడి చేతిలో జప మాల,ఎడమ చేతిలో కమండలం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి.ఈమె నామస్మరణతో కర్మ బంధాలు చెదిరిపోయి మోక్షం సంప్రాప్తిస్తుంది.శివుణ్ణి పతిగా పొందేందుకు తపించిపోయిన రాజకన్య.ఈమెను ఆరాధిస్తే మనస్సుకు ఏకాగ్రత కలుగుతుంది.

నైవేద్యం: పులిహోర

బ్రహ్మచారిణీ ధ్యాన శ్లోకం:

దధానా కరపద్మాభ్యాం అక్షమాలాకమండలూ|

దేవీ ప్రసీదతు మయి బ్రహ్మ చారిణ్యనుత్తమా||

Advertisement

Next Story