- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘‘దిశ’’ స్ట్రింగ్ ఆపరేషన్ సక్సెస్.. ఎట్టకేలకు అశ్విని ఆసుపత్రి సీజ్!
దిశ, భైంసా : పట్టణంలో అర్హతలు లేకుండా చర్మవ్యాధి ఆసుపత్రి కొనసాగుతుందని దీంతో వ్యాధులు నయం కాకుండానే చేతి చమురు వడించుకోవల్సి వస్తుందని సదరు అశ్విని ప్రైవేటు ఆసుపత్రిపై చర్యల తీసుకోవాలని పట్టణంలోని ఓ యువకుడు నెల రోజుల క్రితం నిర్మల్ జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత అధికారి మంగళవారం భైంసా పట్టణానికి వచ్చి సదరు ప్రైవేటు ఆసుపత్రిని సీజ్ చేశారు.
ప్రజారోగ్యం పై సదరు అధికారికి ఉన్న ఆసక్తి ఇట్టే అర్థం అవుతోందని పలువురు ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎలాంటి అర్హతలు లేకుండా వైద్యం చేస్తే బాధితులు ఆర్థికంగా చితికిపోయి ఆరోగ్యం రీత్యా అనేక దుష్ప్రభావాలకు లోనౌతారు. అయిన జిల్లా వైద్యారోగ్య అధికారి సకాలంలో స్పందించక పోవటం గమనిస్తే జిల్లా వైద్యఆరోగ్య అధికారి సదరు ప్రైవేటు ఆసుపత్రి నిర్వాహకుడితో లోపాయికారీ సంబంధాలు కలిగివుండటం వల్లనే చర్యలు చేపట్టడంలో జాప్యాయనికి కారణం అని కొందరు ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నరు. ఇట్టి నకిలీ వైద్యుని లీలలు బయటపట్టడంలో గత నెల ఓ యువకునితో దిశ స్ప్రింగ్ ఆపరేషన్ చేసి అర్హత లేని డాక్టర్ తీరును వెలుగులోకి తీసుకొచ్చింది.తర్వాత అనేక సామాజిక మాధ్యమాలలో మిగతా పలు పత్రికలు, చానల్స్ లలో ప్రచురితమైంది. మొదటగా నకిలీ వైద్యుని గుర్తురట్టును వెలుగులోకి తేచ్చిన దిశ పత్రికి పలువురు ప్రజలు అభినందనలు తెలుపారు.