- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మిల్లర్ల తరుగు దందా.. వరి ధాన్యం రైతుకు మళ్లీ మోసం!
దిశ ప్రతినిధి, నిర్మల్ : వరి ధాన్యం పండించిన అన్నదాతను మళ్ళీ మార్కెట్లో మోసం చేసే దళారులు నిట్టనిలువుగా దోపిడీ చేస్తున్నారు. ఓవైపు ప్రభుత్వం తీవ్రస్థాయిలో హెచ్చరిస్తున్నప్పటికీ అదేమీ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ యంత్రాంగం మాకో లెక్కా..? అన్నట్టుగా అటు కాంటా నిర్వాహకులు ఇటు మిల్లర్లు కలిసి ఈ దందా కొనసాగిస్తున్నారు. వరి ధాన్యం కొనుగోళ్లలో కోతల పెట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ గట్టిగా హెచ్చరించినప్పటికీ ఈ వ్యవహారం మాత్రం ఆగడం లేదు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, మంచిర్యాల జిల్లాలు వరిసాగు చేయడంలో పెట్టింది పేరు. ఈ రెండు జిల్లాల్లో సుమారు 15 లక్షలకు పైగా రైతులు వరి సేద్యం చేస్తారు. ఏటా వరిధాన్యం సేకరించిన తర్వాత సహకార సంఘాలు డీసీఎంఎస్ ల ద్వారా రైతులు ధాన్యం అమ్ముకుంటారు. రైతుల పరిస్థితులను బట్టి ఆసరా చేసుకుంటున్నా కొనుగోలుదారులు మిల్లర్లు కలిసి నిలువునా మోసం చేస్తూనే ఉన్నారు. యాసంగిలో పండించిన వరి ధాన్యం తాలూకు కొనుగోళ్లలోనూ తరుగు దందా మొదలైంది. పౌరసరఫరాల శాఖతోపాటు రెవెన్యూ మార్కెటింగ్ శాఖల నిఘా లోపం వల్లనే ఇది జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. వరి ధాన్యం బస్తాలపై తేమ పేరుట ప్రతి బస్తాకు కనీసం రెండు కిలోలకు తక్కువ కాకుండా కోతలు విధిస్తున్నారు. ఇదేంటని రైతులు అడిగితే మిల్లుల్లో దించిన ధాన్యాన్ని రోజుల తరబడి మిల్లర్లు తీసుకోకుండా ఇబ్బంది పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రైతులు తరుగు విధించిన మిల్లర్లకు అప్పగించేసి వస్తున్నారు.
బస్తాకు 2 నుంచి 6కిలోలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు అమ్ముతున్న ధాన్యాన్ని సహకార సంఘాలు కొనుగోలు చేసి మిల్లర్లకు చేరవేస్తున్నాయి. ట్రాన్స్పోర్టు ఖర్చుల పేరిట కాంటాల్లో ఎంతోకొంత రైతులు ముట్ట చెబుతున్నారు. ఇది కాదని మిల్లుకు చేరిన తర్వాత తేమ పేరిట మిల్లర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నారు. బస్తాకు రెండు నుంచి ఆరు కిలోల దాకా కోత విధిస్తున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నిర్మల్ బైంసారంగాపూర్ ఖానాపూర్ కడెం దండేపల్లి లక్షెట్టిపేట మంచిర్యాల తదితర ప్రాంతాల్లో ఉన్న రైస్ మిల్లర్లు అందరూ ఏకమై తరుగు దందా కొనసాగిస్తున్నారు. ఎక్కడకు వెళ్లినా రెండు నుంచి ఆరు కిలోల మొత్తంలో తరుగు తీసి కొనుగోలు చేస్తున్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే ఆ రైతుల ధాన్యం వెంటనే తీసుకునేందుకు మిల్లర్లు నిరాకరిస్తున్నారు. తేమ ఎక్కువగా ఉందంటూ దబాయిస్తున్నారు.
కమిషనర్ హెచ్చరించినా..
ధాన్యం కొనుగోళ్లలో కోతలు విధించే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. కాంటాల స్థాయిలో మొదలుకొని ట్రాన్స్పోర్ట్ రైస్ ఎక్కడ కూడా రైతులకు అన్యాయం జరగవద్దని ముఖ్యమంత్రి సూచన మేరకు ధాన్యం కొనుగోళ్లలో కోత ఉండవద్దని సూచించారు. ఎవరైనా కోత విధించినట్లు తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని మిల్లులను మూసేందుకు ఆదేశిస్తామని కూడా హెచ్చరించారు. అయినప్పటికీ మిల్లర్లు సిండికేట్గా మారి దందాను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి అధికార యంత్రాంగం తో పాటు ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.