మెగా డీఎస్సీ కోసం NSUI దీక్షలు..

by Sumithra |   ( Updated:2023-09-02 09:33:29.0  )
మెగా డీఎస్సీ కోసం NSUI దీక్షలు..
X

దిశ, బెల్లంపల్లి : మెగా డీఎస్సీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ ఆధ్వర్యంలో శనివారం బెల్లంపల్లిలో దీక్షలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈ దీక్షలు నిర్వహించారు. బెల్లంపల్లి కాంగ్రెస్ ఇంచార్జి చిలుముల శంకర్ దీక్ష శిబిరాన్ని ప్రారంభించారు. మాజీ మంత్రి గడ్డం వినోద్ దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయన్నారు. ప్రభుత్వం మెగా డీఎస్సీ పై వెంటనే నోటిఫికేషన్ జారీచేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజవర్గ నాతరిస్వామి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు హర్షవర్ధన్, బెల్లంపల్లి నియోజకవర్గం అధ్యక్షుడు శివప్రసాద్, ఎనగందుల వెంకటేష్, మాజీ జెడ్పీటీసీ రాంచందర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాయలింగు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story