- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శాంతియుత జీవనానికే తనిఖీలు - డీఎస్పీ జీవన్ రెడ్డి
X
దిశ, నిర్మల్ కల్చరల్ : శాంతిభద్రతల పరిరక్షణకు తనిఖీలు నిర్వహిస్తున్నట్టు నిర్మల్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో బుధవారం ఉదయం పోలీసు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన ధ్రువపత్రాలులేని 114 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్టు తెలిపారు.
కాలనీలో అనుమానాస్పద వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతిఒక్కరు హెల్మెట్ ధరించాలని, వాహన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని అన్నారు. దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ శ్రీనివాస్, రూరల్ సీఐ వెంకటేష్, ట్రాఫిక్ ఎస్సై రాజశేఖర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story