బర్డ్ వాక్ లో నిర్మల్ కలెక్టర్..

by Sumithra |
బర్డ్ వాక్ లో నిర్మల్ కలెక్టర్..
X

దిశ, జన్నారం : కవ్వాల్ టైగర్ జోన్ లో రెండు రోజులుగా కొనసాగుతున్న బర్డ్ వాక్ కార్యక్రమం ఆదివారం ముగిసిందని ఎఫ్డీఓ మాదవరావు తెలిపారు. ఈ బర్డ్ వాక్ లో నిర్మల్ జిల్లా కలెక్టర్ వరుణ్ రెడ్డి పాల్గొన్నారు.

జన్నారం మండలంలోని పులుల సంరక్షణ కేంద్రం ఆధ్వర్యంలో రెండు రోజులు అడవిలో జరిగిన బర్డ్ వాక్ లో అటవీశాఖ వారు ఏర్పాటు చేసిన ప్రాంతంలో రకరకాల పక్షులను వీక్షించారు. రెండురోజుల పాటు నిర్వహించిన ఈ బర్డ్ వాక్ లో వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 70 మంది వరకు పక్షి ప్రేమికులు పాల్గొన్నారు.

Advertisement

Next Story