నాగోబా జాతర స్పెషల్.. గంగా జలానికి బయలుదేరిన మెస్రం వంశీయులు

by Hamsa |   ( Updated:2023-01-07 07:51:23.0  )
నాగోబా జాతర స్పెషల్.. గంగా జలానికి బయలుదేరిన మెస్రం వంశీయులు
X

దిశ, ఇచ్చోడ : తెలంగాణ రాష్ట్రంలో మేడారం జాతర తరువాత అత్యంత ప్రజాదరణ పొందిన గిరిజనుల జాతర నాగోబా. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది. నాగోబా ఆలయం ఇంద్రవెళ్లి మండలంలోని కేస్లాపూర్ లో ఉంది. ఈ జాతరకు ప్రస్తుతం అన్నీ ఏర్పాట్లు చురుకుగా కొన సాగుతున్నాయి. పుష్య మాసం రోజున నెల వంక కనిపించగానే మెస్రం వంశీయులు ఉత్సహంతో ఉప్పొంగిపోతారు. ఎందుకంటే గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబా జాతర అప్పుడే ప్రారంభమవుతుంది కాబట్టి.. ఈ జాతర జనవరి 21 న ప్రారంభం కానుంది. ఈ జాతర ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకుంది. వారం రోజుల పాటు భక్తి శ్రద్ధలతో, వైభవంగా ఆదివాసుల నిర్వహిస్తారు.

కాలి నడకన..

తమ ఆరాధ్య దైవం నాగోబా దేవుడి అభిషేకానికి అవసరమైన గంగాజలం కోసం ఆదివాసీలు (మెస్రం వంశీయులు) గోదావరికి మహా పాదయాత్రగా జనవరి 1 న బయలు దేరి వెళ్లారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లోని కలమడుగు ప్రాంతంలోని గోదావరి జలాన్ని తీసుకువచ్చేందుకు పాద రక్షాలు లేకుండా కేస్లాపూర్‌ నుంచి బయలు దేరిన భక్తులు ఆయా గ్రామాల్లో పర్యటిస్తూ అటవీ ప్రాంతం నుంచి ఈ నెల 10న గోదావరికి చేరుకుంటారు. అక్కడ సేకరించిన జలంతో ఈ నెల 17న తిరిగి నాగోబా ఆలయానికి చేరుకుంటారు. జనవరి 21వ తేదీన రాత్రి 10 గంటలకు గంగాజలంతో నాగోబా సన్నిధిలో దేవుడికి అభిషేకం నిర్వహిస్తారు. అనంతరం మహాపూజ నిర్వహించి జాతర ప్రారంభిస్తారు. ఈ జాతర వారం రోజులపాటు కన్నుల పండువగా జరుగుతుంది. ఆలయ పీఠా ధిపతి మెస్రం వెంకట్రావు, పూజారి కోసు ప్రధాన్‌ దాదేరావు సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Advertisement

Next Story

Most Viewed