‘వరద ముంపు రైతులను ఆదుకోండి..’

by Aamani |
‘వరద ముంపు రైతులను ఆదుకోండి..’
X

దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద తాకిడికి వేలాది ఎకరాలు నీట మునిగి అపార నష్టం వాటిల్లిందని,ఆ ముంపు బాధిత రైతులను ఆదుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రభుత్వాన్ని కోరారు.ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే కలిసి జిల్లా రైతు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ముఖ్యంగా పెన్గంగా నది పరివాహక ప్రాంతంలో వరదలు పోటెత్తి పత్తి, సోయాబీన్, కంది పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పంట పెట్టుబడి సైతం చేతికి రాని పరిస్థితి నెలకొందనీ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో వరదల నష్టం పై వెంటనే అంచనా వేసి రైతులకు నష్ట పరిహారం అందించాలని, ఫసల్ బీమా యోజన పథకాన్ని పకడ్బందీగా అమలు పరచాలని కోరారు.దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సమస్యలపై సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed