MLA Bojju Patel : సమస్యల పరిష్కారం కోసమే ఫోన్ ఇన్ కార్యక్రమం

by Sridhar Babu |
MLA Bojju Patel : సమస్యల పరిష్కారం కోసమే ఫోన్ ఇన్ కార్యక్రమం
X

దిశ,ఉట్నూర్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఫోన్ ఇన్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వివిధ మండలాల నుంచి భూ సమస్యలు, ఇందిరమ్మ ఇండ్లు, రోడ్లు, నీటి, మురుగు కాలువలు, ఫారెస్ట్, పెన్షన్ సమస్యల ఫోన్ కాల్స్ వచ్చాయి.

ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవడం కోసం ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

మండలంలోని శాంతినగర్ కాలనీ వాసీ, ఐటీడీఏ హాస్టల్ లో డైలీ వైజ్ వర్కర్ గా విధులు నిర్వహిస్తున్న సేడ్మకి రాజు ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మృతుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ముందుగా రాజు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

Advertisement

Next Story