- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బాధపడకు నేనున్నా.. చిన్నారి దుర్గకు మంత్రి కోమటిరెడ్డి వీడియో కాల్..
దిశ, భైంసాః విధి రాసిన రాతలో ఒంటరి అయింది ఓ చిన్నారి అనే శీర్షికతో మొదట ఆదివారం ఉదయం దిశ పత్రిక కథనం ప్రచురించగా ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అయ్యి పలు మీడియాలలో సైతం ప్రచురించారు. చిన్నారి దుర్గకు చాలా మంది సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. నిన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడగా, నేడు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో కాల్ లో పలకరించారు. బాధపడకు.. నేనున్నా ప్రతిక్ రెడ్డి ఫౌండేషన్ నుండి లక్ష రూపాయలు పంపిస్తున్నానని, ప్రతినెలా మనీ పంపిస్తా, ఇల్లు కూడా కట్టిస్తానని భరోసా ఇచ్చారు. మంచిగా తిని ఆరోగ్యంగా ఉండి చదవాలంటూ పాపతో మాట్లాడారు. త్వరలోనే నీ వద్దకు వచ్చి కలుస్తానని, ఏదైనా సమస్య ఉంటే స్థానిక ఎమ్మార్వోకి, ఎంపీడీవోకి తెలియజేయాలని తెలిపారు. ముధోల్ తాలూకా తానూరు మండలం బేల్ తరోడ గ్రామంలో దుర్గ చిన్నారితల్లి గంగామణి(36) ఆత్మహత్య చేసుకొగా, గతంలోనే తండ్రి మరణించగా పాపా అనాథగా మిగిలి, అమ్మ అంత్యక్రియలకు డబ్బులకై గుడ్డను పరిచి సహాయార్థుల సహాయం కోరిన విషయం తెలిసిందే.