వైద్య విద్యార్థికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సన్మానం

by samatah |   ( Updated:2022-03-06 09:44:05.0  )
వైద్య విద్యార్థికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సన్మానం
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఉక్రెయిన్ దేశంలో చిక్కుకు పోయిన నిర్మల్ పట్టణానికి చెందిన వైద్య విద్యార్థి సాయిక్రిష్ణ నిన్న స్వదేశానికి క్షేమంగా చేరుకున్నాడు. ఆదివారం నిర్మల్ మంత్రి క్యాంపు కార్యాలయంలో సాయి క్రిష్ణను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శాలువా తో సత్కరించారు. ఈ సందర్భంగా సాయి క్రిష్ణ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

ఇండియా‌కు సురక్షితంగా రావడానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించారని ఎప్పటికప్పుడు తనతో ఫోన్ లో మాట్లాడి అధైర్య పడవద్దని భరోసా ఇచ్చారని సాయికృష్ణ తెలిపాడు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము,విప్ వేణు,మల్లికార్జున రెడ్డి, డి.శ్రీనివాస్,ముడుసు సత్యనారాయణ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story