ఆర్టీవో కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి అల్లోల..

by Sumithra |   ( Updated:2023-05-23 14:48:31.0  )
ఆర్టీవో కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి అల్లోల..
X

దిశ, సారంగాపూర్ : రాష్ట్రవ్యాప్తంగా రవాణా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని చించోలి బి.గ్రామ సమీపంలో 3 కోట్ల 50 లక్షల వ్యయంతో నిర్మించిన జిల్లా రవాణాశాఖ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యాలయంని అధికారులు గతంలో నిర్మల్ పట్టణంలో ఇరుకు గదుల్లో విధులు నిర్వహించేవారని చించోలి బి వద్ద సువిశాల ప్రాంతంలో అన్ని హంగుళాలతో నూతన భవనాన్ని నిర్మించారన్నారు. దీని ద్వారా రవాణా శాఖ సిబ్బందికి ప్రజలకు సౌకర్యాలు కలగనున్నాయని పేర్కొన్నారు. వాహనాలు కలిగిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండాలని దీంతో పాటు ద్విచక్ర వాహనం నడిపే సమయంలో హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలను నడిపితే ప్రమాదాలు సంభవిస్తాయని పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతే వ్యక్తి పై ఆధారపడ్డ కుటుంబం దిక్కులేనిదవుతుందని పేర్కొన్నారు.

జిల్లా కేంద్రంలో నిర్మించిన జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని, 30 కోట్లతో నిర్మించిన మైనార్టీ గురుకుల పాఠశాలను సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని అన్నారు. నిర్మల్ జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు కావడం ఈ ప్రాంత ప్రజలకు వరమని, పేదవిద్యార్థులు సైతం వైద్య విద్యను అభ్యసించే అవకాశం కలుగుతుందన్నారు. నిర్మల్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తున్నామని అభివృద్ధి సంక్షేమాలలో రాజిలేకుండా కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. అనంతరం మారుతి షోరూమ్ యజమానులకు డ్రైవింగ్ స్కూల్ అనుమతి పత్రాన్ని అందించి డ్రైవింగ్ నేర్చుకునే వారందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి అజయ్ కుమార్ రెడ్డి వాహనదారులకు అందిస్తున్నటు వంటి సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విట్ఠల్, డీటీసీ పుప్పాల శ్రీనివాస్, జిల్లా రైతు బంధు కోఆర్డీనేటర్ వెంకట్ రాంరెడ్డి మున్సిపల్ చేర్మెన్ గుండ్రత్ ఈశ్వర్, జడ్పిచైర్మెన్ విజయ లక్ష్మి రాంకిషన్ రెడ్డి, టీఏన్జీవో జిల్లా అధ్యక్షులు శ్యాం నాయక్, ఎంపీపీ అట్లా మైపాల్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మి రమేష్, సొసైటీల చైర్మెన్ లు నారాయణ్ రెడ్డి, మాణిక్ రెడ్డి, పార్టీ మండలాధ్యక్షులు మాధవ్ రావు, నాయకులు శ్రీనివాస్ రెడ్డి రాంరెడ్డి ఇస్మాయిల్ గంగిరెడ్డిలతో పాటు నాయకులు ఉన్నారు.

Advertisement

Next Story