Mercedes Benz: అన్ని కార్ల ధరలు పెంచిన మెర్సిడెస్ బెంజ్ ఇండియా

by S Gopi |   ( Updated:2024-11-15 14:38:51.0  )
Mercedes Benz: అన్ని కార్ల ధరలు పెంచిన మెర్సిడెస్ బెంజ్ ఇండియా
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా అన్ని వాహనాల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అన్ని మోడళ్లపై 3 శాతం మేర పెంపు నిర్ణయం తీసుకున్నామని, వచ్చే ఏడాది జనవరి 1 నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. ఇన్‌పుట్ ఖర్చులు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ళు, కార్యకలాపాల వ్యయం పెరిగిన కారణంగా బెంజ్ కొంత భారం వినియోగదారులకు బదిలీ చేసింది. దీంతో బెంజ్ కార్ల ధరలు కనీసం రూ. 2 లక్షల నుంచి గరిష్ఠంగా రూ. 9 లక్షల వరకు ఖరీదు కానున్నాయి. గత మూడు త్రైమాసికాలుగా కంపెనీ నిర్ణయం వ్యయ భారాన్ని మోస్తోందని, దీన్ని అధిగమించేందుకు ధరలు పెంచుతున్నట్టు మెర్సిడెస్ బెంజ్ ఇండియా సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ అయ్యర్ చెప్పారు. డిసెంబర్ 31 కంటే ముందు బుకింగ్ చేసుకునే వారికి పెంపు వర్తించదని కంపెనీ స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed