Breaking: మరో అడుగు ముందుకు.. కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ

by srinivas |   ( Updated:2024-11-15 13:14:27.0  )
Breaking: మరో అడుగు ముందుకు.. కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాజధాని అమరావతి(AP Capital Amaravati) అభివృద్ధిపై ప్రభుత్వం(Government) దృష్టి పెట్టింది. ఈ మేరకు పెట్టుబడులను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా కంపెనీలకు భూములు కేటాయించాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికే పలు సంస్థలకు ప్రభుత్వం భూకేటాయింపులు(Land Allotments) చేసింది. ఇప్పుడు ఈ భూ కేటాయింపులను పరిశీలన చేయాలని భావిస్తోంది. అలాగే కొత్త సంస్థలకు భూకేటాయింపులు జరపాలని నిర్ణయించింది. ప్రపంచస్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావాలని ప్రణాళికలు రూపొందిస్తోంది.

అయితే ఈ బాధ్యతలను కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub Committee)కి అప్పగించింది. ఈ మేరకు కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు అమరావతిలో భేటీ అయ్యారు. రాజధానిలో భూముల కేటాయింపుపై చర్చిస్తోంది. భూముల కేటాయింపుల విషయంలో ‘ఏం చేద్దా.. ఎలా చేద్దాం’ అనే అంశాలపై సబ్‌ కమిటీ సభ్యులు చర్చిస్తున్నారు. ఇప్పటికే కంపెనీలకు కేటాయించిన భూములను పరిశీలించి కొత్త పరిశ్రమలకు జరపాల్సిన కేటాయింపులపైనా కమిటీ సభ్యులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అమరావతి అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలపై కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ భేటీ కొనసాగుతుంది. ముగిసిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed