Ram Charan: గేమ్ చేంజర్ నుంచి మరో సాంగ్.. అప్‌డేట్‌తో హైప్ పెంచుతున్న మూవీ టీమ్

by sudharani |
Ram Charan: గేమ్ చేంజర్ నుంచి మరో సాంగ్.. అప్‌డేట్‌తో హైప్ పెంచుతున్న మూవీ టీమ్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘గేమ్ చేంజర్’ (Game Changer) ఒకటి. శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మోస్ట్ ప్రెస్టీజియస్ చిత్రంలో కియారా అద్వానీ (Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, సునీల్, సముద్రఖని, ఎస్ జే సూర్య తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఫుల్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌ (Political Background)తో రూపొందుతున్న ఈ చిత్రం భారీ అంచనాల మధ్య 2025 సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ సమయం కూడా దగ్గర పడటంతో ప్రమోషన్స్‌ (Promotions)లో భాగంగా వరుస అప్‌డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పండుగ వాతావరణాన్ని అందిస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాంగంగా ఈ మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టకోగా.. ఇటీవల వచ్చిన ‘నానా హైరానా’ సాంగ్ సోషల్ మీడియా (Social Media)లో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటూ దూసుకుపోతుంది.

ఇప్పుడు ఇదే జోష్‌తో తాజాగా మరో సాంగ్ (song) అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ‘మిమ్మల్ని మరింత షేక్ చెయ్యడానికి హై వోల్టేజ్ (high voltage) రాబోతుంది.. సిద్ధంగా ఉన్నారా? ఈరోజు సాయంత్రం 6:03 గంటలకు ప్రోమో డ్రాప్ అవుతుంది. అలాగే ఫుల్ సాంగ్ (Full Song) డిసెంబర్ 21న వస్తుంది! చూస్తూ ఉండండి!!’ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్, కియారా అద్వానీ పింక్ కలర్ డ్రెస్‌లో రొమాంటిక్ లుక్‌ (Romantic Look)తో ఆకట్టుకుంటున్నారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ వైరల్ అవుతోంది. కాగా.. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed