అదానీతో ప్రధాని మోడీకి లాలూచీ ఒప్పందం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
అదానీతో ప్రధాని మోడీకి లాలూచీ ఒప్పందం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాహుల్ గాంధీ(Rahul Gandhi) పిలుపు మేరకు రాజ్‌భవన్‌(Raj Bhavan)ను ముట్టడించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) స్పష్టం చేశారు. బుధవారం రాజ్‌భవన్ ఎదుట బైటాయించి మీడియాతోమాట్లాడారు. ప్రభుత్వమే ధర్నాలు చేయడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ముందు అదానీ(Adani) విషయంలో బీఆర్ఎస్(BRS) స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. 75 ఏళ్ల పాటు కష్టపడి కాంగ్రెస్(Congress) పార్టీ దేశ ప్రతిష్టను పెంచిందని అన్నారు. కానీ అదానీ, ప్రధాని ఇద్దరు కలిసి దేశం పరువు తీశారని మండిపడ్డారు. వ్యాపారం చేసేందుకు అదానీ అంచాలు ఇచ్చారని అమెరికా సంస్థలు తేల్చాయని చెప్పారు. ఈ అంశంపై పార్లమెంట్‌(Parliament)లో కేంద్రాన్ని రాహుల్ గాంధీ నిలదీశారు. అంశంపై మాట్లాడేందుకు, చర్చించేందుకు ప్రధాని మోడీ మౌనం వహిస్తున్నారని అన్నారు.

అదానీ(Adani)పై విచారణకు జేపీసీ(JPC) నేతృత్వం వహించాలని డిమాండ్ చేశారు. అసలు అదానీని కాపాడటానికి ఎవరు ప్రయత్నిస్తున్నారో ముందు ఆ విషయం తేలాలని అన్నారు. తమ పోరాటం ఇక్కడితో ఆగదని.. ప్రధాని మోడీ మౌనం వీడకపోతే రాష్ట్రపతి భవన్ ఎదుట ధర్నా చేస్తామని సంచలన ప్రకటన చేశారు. జేపీసీ వేస్తే తప్పకుండా అదానీ జైలుకు వెళ్తానని అన్నారు. వేయకపోతే మోడీనే అదానీని కాపాడినట్లవుతుందని తెలిపారు. అదానీతో మోడీ లాలూచీ ఒప్పందం చేసుకున్నారని కీలక ఆరోపణలు చేశారు. అంతేకాదు.. బీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. అరెస్ట్ వార్తలు రాగానే హుటాహుటిన కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలతో ఒప్పందం చేసుకున్నారని అన్నారు. నాణానికి ఒకవైపు మోడీ, మరోవైపు కేసీఆర్ ఉంటారని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed