- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అధికార పార్టీలో గుబులు పుట్టిస్తున్న సుమన్ తీరు..
దిశ, మంచిర్యాల టౌన్ : మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ తీరు అధికార పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తుంది. సుమన్ వ్యవహార శైలి పై ఆ పార్టీ సీనియర్ నాయకులు గుర్రుగా ఉన్నారు. జిల్లా అధ్యక్షుడు అయినప్పటి నుండి జిల్లా పై పెత్తనం చెలాయిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయిన మంచిర్యాల, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్యల సీటుకు ఎసరు పెడుతున్నాడు అని ఆ పార్టీ సీనియర్ నాయకులు భావిస్తున్నారు. అందులో భాగంగానే సుమన్ కు వ్యతిరేకంగా ఉన్న నాయకుల పై అక్రమ కేసులు పెడుతూ వారిని పర్సనల్ గా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అనే విమర్శలు స్థానిక నేతల నుండి వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే మందమర్రికి చెందిన బీఆర్ఎస్ నాయకురాలు ఒకరు అధికార పార్టీకి రాజీనామా చేయడం నియోజక వర్గంలో చర్చనీయాంశంగా మారింది.
ఉద్యమ కాలం నుండి బీఆర్ఎస్ పార్టీలో క్రియ శీలకంగా పని చేసిన మందమర్రికి చెందిన బత్తుల సరిత అనే బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు ఇటీవల పార్టీకి రాజీనామా చేసింది. సుమన్ ఒంటెద్దు పోకడలు ఆయన వ్యవహార శైలి నచ్చకనే ఆమె పార్టీని వీడుతునట్లు పలుసందర్భాలలో తెలిపింది. సరితకు సోదరి అయిన మహిళ ఒకరు బీఎస్పీ పార్టీలో చేరి నిత్యం సుమన్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తుందని, నియోజక వర్గంలో తిరుగుతూ అభివృధి పనుల పై ప్రశ్నిస్తుందనీ ఎలా అయిన ఆమెను బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని రావాలని సుమన్ తన పై ఒత్తిడి తీసుకొచ్చాడని, అంతే కాకుండా సింగరేణి క్వాటర్ లో నివాసం ఉంటున్న తన సోదరుడి ని సైతం, తన పై ఉన్న కక్ష్యతోనే నిర్ధాక్షిణ్యంగా క్వాటర్ లో నుండి గెంటేపించినట్లు కుడా ఆమె తెలిపింది. ఈ నెల 9 న జరిగిన కేసీఆర్ సభకు మందమర్రి నుండి ఎక్కువ సంఖ్యలో మహిళలు రాలేదని వారిని సరితనే సభకు రాకుండా అడ్డుకుందని, ఆమె బీఆర్ఎస్ లో కొనసాగితే మహిళ నాయకులు తన వెంట సభకు వచ్చే వారని గ్రహించిన సుమన్ ఇటీవల తన అనుచరులతో కలిసి ఆమెను తిరిగి బీఆర్ఎస్ లోకి ఆహ్వానించడానికి ప్రయతించగ, ఆమె మళ్లీ బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి తిరస్కరించింది.
అది మనసులో పెట్టుకున్న సుమన్ ఇటీవల మందమర్రిలో బెల్ట్ షాప్ లను ఎత్తేయాలని డిమాండ్ చేసిన మహిళల పై పోలీసులు పలు సెక్షన్ ల కింద కేసునమోదు చేయగా అందులో బత్తుల సరిత ను A2 గా పరిగణించి ఆమెను ఆసిఫాబాద్ కోర్టుకు తరలించడంలో సుమన్ ముఖ్య పాత్ర పోషించినట్లు స్థానికుల నుండి వినిపిస్తుంది.
బెడిసి కొట్టిన సుమన్ వ్యూహం..
రామకృష్ణపుర్ లో గత కొన్ని ఏండ్లుగా సింగరేణి ఆసుపత్రిలో వైద్యాధికారిగా కొనసాగుతున్న రాజరమేష్ వృత్తితో పాటు, పలు సామాజిక కార్యక్రమాలలో ముందు ఉండేవాడు. నిత్యం ఎదో ఒక సేవ కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తూ వారి మన్ననలు పొందాడు. కరోనా సమయంలో చాలా మందికి సహాయం అందించాడు. ఇటీవల కాలంలో తనకంటు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని చెన్నూర్, రామాకృష్ణపుర్ , భీమరం, మందమర్రి, జైపూర్ లో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు దగ్గర అవుతున్న రాజరమేష్ ను చూసిన సుమన్, తనకు వ్యతిరేకంగా ఎక్కడ మారుతాడో అని గమనించి తనను ఖమ్మం జిల్లాలోని ఇళ్ళందుకు బదిలీ చేయించాడని సమాచారం. డాక్టర్ గా కొనసాగుతూ సేవ కార్యక్రమాలు చేస్తున రాజ రమేష్ ను ఎటువంటి కారణం లేకుండా ఇల్లందుకు బదిలీ చేయించడం అప్పట్లో స్థానికంగా తీవ్ర దుమారమే లేపింది. బదిలీ పై వెళ్ళాడు ఇక తిరిగి రాడులే అనుకున్న సుమన్ కి రాజ రమేష్ గట్టి షాక్ ఇచ్చాడు.
ఇల్లందు కు బదిలీ పై వెళ్లిన రమేష్ ఖమ్మం జిల్లా లో సీనియర్ రాజకీయ నాయకులు అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లతో కలిసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం సుమన్ ను మింగుడు పట్టనియకుండ చేసింది. తన సేవ కార్యక్రమాలతో నియోజకవర్గంలో తనకు అడ్డుగా ఉన్నాడు అని భావించి, రమేష్ ను అడ్డు తొలగించుకోవాలని తనని బదిలీ చేయించిన సుమన్ వ్యూహం కాస్త బెడిసి కొట్టడంతో సుమన్ కాస్త అయోమయంలో పడ్డారు. ఇల్లందు కు బదిలీ పై వెళ్ళడం రమేష్ కు కలిసి వచ్చిందని, నియోజక వర్గంలో తనకంటూ అనుచరులు ఉండడంతో పాటు సామాజిక కార్యక్రమాల్లో ముందున్న రాజ రమేష్ కు కాంగ్రెస్స్ పార్టీ నుండి ఒకవేళ టికెట్ వస్తే సుమన్ కు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని నియోజకవర్గ ప్రజల నానుడి.
కాంగ్రెస్స్ పార్టీ లో చేరే ఆలోచనలో ఉన్న రాజ రమేష్, వైద్య వృత్తికి రాజీనామా చేసి నియోజక వర్గ ప్రజలకు సేవ చేసేందుకు ముందు ఉంటానని తన అనుచరులకు చెప్తున్నట్లు సమాచారం. చేన్నుర్ నియోజక వర్గానికి చెందిన ముఖ్యనేతల్లో ఒక్కరు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్ల లో జెడ్పీ వైస్ చైర్మన్ గా కొనసాగిన మూల రాజిరెడ్డి, ప్రస్తుతం బీమరం సిట్టింగ్ ఎంపీపీగా కొనసాగుతున్న మహిళ నాయకురాలు తండ్రి చెరుకు సరోత్తం రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరబోతున్నారని స్థానికంగా చర్చ కొనసాగుతుంది. అంతే కాకుండా నియోజక వర్గంలో సుమన్ కు వ్యతిరేకంగా ఉన్న సీనియర్, యువ నాయకులు అందరినీ రాజ రమేష్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.