నూతన ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్

by Sridhar Babu |
నూతన ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్
X

దిశ, బోథ్ : నూతన ఆర్థిక సంస్కరణల రూపశిల్పి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని పలువురు నాయకులు అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మన్మోహన్ సింగ్ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పట్టణ ప్రముఖులు పూలమాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ దేశంలో నూతన ఆర్థిక సంస్కరణలను తీసుకువచ్చి దేశీయ మార్కెట్లను కాపాడిన రాజనీతిజ్ఞుడు దివంగత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అని అన్నారు.

ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని అమలు చేశారని, పాలనలో పారదర్శకత కోసం సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చారని కొనియాడారు. ఆయన లేని లోటు పూడ్చ లేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి, మాజీ చైర్మన్ గొర్ల రాజు యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి, మాజీ ఎంపీటీసీలు చట్ల ఉమేష్, షేక్, నాజర్ అహ్మద్, కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ భత్తుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed