Missing person found : ఎడతెరిపి కురుస్తున్న వర్షంకు తప్పిపోయిన వ్యక్తి ...కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు

by Sridhar Babu |
Missing person found : ఎడతెరిపి  కురుస్తున్న వర్షంకు తప్పిపోయిన వ్యక్తి ...కుటుంబ సభ్యులకు అప్పగించిన పోలీసులు
X

దిశ, ఖానాపూర్ : రాష్ట్రంలో గత నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు బుధవారం నిర్మల్ జిల్లా దాస్తురాబాద్ మండల కేంద్రానికి చెందిన గొర్రెల కాపరి తప్పిపోయాడు. వివరాలకై దస్తురాబాద్ మండలానికి చెందిన గుండా శ్రీనివాస్ (47 ) బుధవారం ఆకొండపేట గ్రామ శివారు అటవీ ప్రాంతంలోకి తన గొర్లను మేపడానికి వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి రాక పోయేసరికి, కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. కొందరు ఇచ్చిన సలహాతో 100 డయల్ కు ఫోన్ చేయడంతో వెంటనే స్పందించిన కానిస్టేబుళ్లు శ్రావణ్, సురేందర్ కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో కలిసి ఆకొండపేట, కళ్లేడ అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా తెలియరాలేదు. తిరిగి గురువారం

తెల్లవారుజామున 4:30 గంటల నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు తప్పిపోయిన వ్యక్తి గురించి అటవీ ప్రాంతాలలో, చుట్టు పక్కల గ్రామాలలో గాలించారు. దాంతో కళ్లేడ గ్రామ సమీప ప్రాంతంలో కనిపించినట్లు కొందరు గ్రామస్తులు తెలిపారు. వారి వివరాలతో ఖానాపూర్ సీఐ సైదారావు, దాస్తురాబాద్ ఎస్ఐ శంకర్ పర్యవేక్షణలో సిబ్బంది వెతకటం ప్రారంభించారు. ఎస్ఐ శంకర్ టీం సిబ్బంది, గ్రామస్తుల సహాయంతో జన్నారం మండలంలోని నరసింగపూర్ గ్రామ అటవీ ప్రాంతంలో తిరుగుతున్న శ్రీనును పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దాంతో దాస్తురాబాద్ పొలీస్ లను జిల్లా ఎస్పీ డా.జానకి షర్మిల ఖానాపూర్ సీఐ సైదారావు, దాస్తురాబాద్ ఎస్ఐ శంకర్, కానిస్టేబుల్ లు శ్రావణ్, సురేందర్, రవి , శ్రీనివాస్ లను అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed