కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు..

by Sumithra |
కోర్టు విధులను బహిష్కరించిన న్యాయవాదులు..
X

దిశ, లక్షెట్టిపేట : రంగారెడ్డి కోర్టు న్యాయవాది నారపాక సురేందర్ పై ఓ సివిల్ దావా కేసులోని ప్రత్యర్థులు దాడి చేసిన ఘటనకు నిరసనగా లక్షెట్టిపేట మున్సిఫ్ కోర్టు న్యాయవాదులు బుధవారం కోర్టు విధులను బహిష్కరించారు.

దాడికి పాల్పడిన వారిపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడిగొప్పుల కిరణ్, ప్రధాన కార్యదర్శి ప్రదీప్, ఏజీపీ పద్మ, న్యాయవాదులు రాజేశ్వర్ రావు, భూమిరెడ్డి, రాజారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story