- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చించోలిబి గండి రామన్న హరితవనంలో బోటింగ్ సిస్టమ్ ప్రారంభం
దిశ,సారంగాపూర్: నిర్మల్ జిల్లా గండి రామన్న హరితవనంలో పిల్లలకి నీటిలో విహరించడానికి గురువారం బోటింగ్ లను అటవీ దేవాదాయ న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన చైన్ లింక్, సఫారీ, గజీబో, ఎకో హట్స్, చిన్న పిల్లల కోసం బోటింగ్, పార్కును మంత్రి ప్రారంభించారు. మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి జిల్లాలో ఈ పార్కులు ఏర్పాటు చేశామని తెలిపారు. నిర్మల్ జిల్లాలో 3 లక్షల రూపాయలతో రెండు బోటింగ్లను ఏర్పాటు చేశారు.
పట్టణంలో వివిధ గ్రామాల్లో పిల్లలకు సెలవులు ఉన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి గండి రామన్న పార్కులో టూర్ లాగా వచ్చి కాలక్షేపం చేయవచ్చునని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆక్సిజన్ కొనే పరిస్థితి రావద్దని ప్రతి ఒక్కరు కచ్చితంగా మొక్కలు నాటి వాటిని కాపాడాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నల్ల వెంకటరామిరెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, అటవీ అధికారి సి సి ఎఫ్ సర్వానన్, డీఎఫ్ఓ రామకిషన్, ఎఫ్ ఆర్ ఓ జైపాల్ రెడ్డి, చించోలి బి సర్పంచ్ లక్ష్మీ రమేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.