కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం స్థాపన కోసం సహకరిస్తా: ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్

by S Gopi |
కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం స్థాపన కోసం సహకరిస్తా: ఎమ్మెల్యే రేఖా శ్యాంనాయక్
X

దిశ, ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో తెలంగాణ పోరాట వీరుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఏర్పాటు కోసం సహకరిస్తానని ఎమ్మెల్యే అజ్మీరా రేఖశ్యాం నాయక్ హామీ ఇచ్చారు. శుక్రవారం రోజున నిర్మల్ జిల్లాలోని తిమ్మాపూర్, ఖానాపూర్, రాజురా, పెంబి, దస్తూర్బాద్ పద్మశాలి సంఘాల మండల నాయకులు ఎమ్మెల్యే నివాసంలో కలిసిన నాయకులు ఎమ్మెల్యేకు విన్నవించగా హామీ ఇచ్చారు. అంతకు ముందు తిమ్మాపూర్ పద్మశాలి సంఘ భవనం నుండి అందరూ ర్యాలీగా నివాసానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి రాష్ట్ర నాయకులు జల్ద రమణ, జిల్లా అధ్యక్షులు-నిర్మల్ వ్యవసాయ కమిటీ అధ్యక్షులు చిలుక రమణ, ప్రధాన కార్యదర్శి అల్లం అశోక్, కోశాధికారి ఎనగందుల నారాయణ, తిమ్మాపూర్ అధ్యక్షులు-ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఖానాపూర్ అధ్యక్షులు అల్వాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story