- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొమురం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి
దిశ, ఉట్నూర్ : కొమురం భీం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. కొమురం భీం వర్ధంతి సందర్భంగా స్థానిక కేబీ ప్రాంగణంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అదే విధంగా మండలంలోని తక్కుగూడలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జల్, జంగల్, జమిన్ కోసం, ఆదివాసుల హక్కుల సాధనకు నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొమురం భీం అన్నారు.
అటవీ హక్కుల సాధనకు నిరంతరం పోరాడారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ భీంను ఆదర్శంగా తీసుకొని ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. అలాగే భీం వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో కేబీ కాంప్లెక్స్ లోని భీం విగ్రహానికి బీజేపీ, ఆదివాసీ, మాల సంఘం నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో బీజేపీ, పలు సంఘాల నాయకులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు రితేష్ రాథోడ్, సుషిల్ కుమార్, రమేష్, కొండేరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.