నవంబర్ 26న మంచిర్యాలలో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ ?

by Kalyani |   ( Updated:2023-10-12 11:45:23.0  )
నవంబర్ 26న మంచిర్యాలలో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ ?
X

దిశ, మంచిర్యాల: ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల 26న మంచిర్యాలలో సీఎం కేసీఆర్ ఎన్నికల బహిరంగ సభ ఏర్పాటుకు నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం. ఈనెల 15 నుంచి సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో వచ్చే నెల7న చెన్నూరులో, 8న బెల్లంపల్లి లో కేసీఆర్ ప్రచార ఎన్నికల బహిరంగ సభలను ఖరారు చేశారు. కాగా, ఈ ప్రచార సభల్లో మంచిర్యాల కేంద్రం లేదు. దీంతో మరో విడత గా మంచిర్యాలలో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ ఉండేలా నిర్ణయించారని తెలుస్తున్నది.

Advertisement

Next Story