కన్నుల విందుగా కార్తీక పౌర్ణమి వేడుకలు

by Sridhar Babu |
కన్నుల విందుగా కార్తీక పౌర్ణమి వేడుకలు
X

దిశ, ఆదిలాబాద్ : శివపార్వతులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక పౌర్ణమిని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచి ఉపవాస దీక్షను చేపట్టి, పుణ్యస్నానాలు ఆచరించి ఆలయాలకు బారులుతీరారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులతో సందడి నెలకొంది. దీపాలంకరణతో ఆలయాలను ముస్తాబు చేయగా, ఆ ఆలయాలకు తరలివచ్చిన భక్తులు దీపాలు పేర్చి, శివపార్వతులను భక్తిశ్రద్ధలతో పూజించారు.

ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోనే కాకుండా, జిల్లా కేంద్రంలోని ప్రముఖ ఆలయాలతో పాటు ఆయా కాలనీలో ఉన్న శివాలయాలు, హనుమాన్ ఆలయాలు, శ్రీ సత్య నారాయణ స్వామి ఆలయాలతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్ మండలంలో గల శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు.

గోపాలకృష్ణ మఠంలో ప్రత్యేక దీపాలంకరణ

ఇది ఇలా ఉండగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రామచంద్ర గోపాలకృష్ణ మఠం వద్ద ప్రత్యేక కాగడ హారతి దీపాలంకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రత్యేక హంగులతో దీపారాధన చేసిన భక్తులు ఆలయంలో గోపాలకృష్ణుడికి పూజలు చేసి, శివనామ స్మరణతో పరవశించిపోయారు. ఈ కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే పాయల శంకర్ దంపతులు, మఠ పీఠాధిపతి యోగానంద సరస్వతి స్వామి భక్తులతో కలిసి కాగడ హారతి, కాగడ జ్యోతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed