కాళేశ్వరం ప్రాజెక్టు ముంపుబాధిత రైతులు ధర్నా..

by Sumithra |
కాళేశ్వరం ప్రాజెక్టు ముంపుబాధిత రైతులు ధర్నా..
X

దిశ, మంచిర్యాల : కాళేశ్వరం ప్రాజెక్టు అన్నారం, మేడిపల్లి, సుందిళ్ల బ్యారేజీలతో పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ బ్యారేజీలతో వరదముంపు బారిన పడుతున్న పంటలకు ఎకరానికి రూ.25వేల చొప్పున పరిహారం అందజేసీ ముంపుగ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించాలని కోరారు. అనంతరం పలుడిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్ లో అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంకె రవి, సాగర్, రాజన్న, సమ్మగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story