ఘనంగా హోలీ పండుగ వేడుకలు

by S Gopi |
ఘనంగా హోలీ పండుగ వేడుకలు
X

దిశ, కాసిపేట: మండలంలో హోలీ పండగ వేడుకలను మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే తమ తమ కాలనీలలో చిన్నా పెద్ద భేదం లేకుండా చిన్నారులు, పెద్దలు, మహిళలు, యువతీయువకులు రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుని హోలీ పండుగలో పాల్గొన్నారు. చిన్నారులు ఉదయం నుండే చిన్న చిన్న కర్రలతో జాజిరి పాటలు పాడుతూ జాజిరి ఆట ఆడారు. కాలనీలు, రోడ్లు రంగులమయం అయ్యాయి. నాయకులు ఒకరికి ఒకరు రంగులు చల్లి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Advertisement

Next Story