- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మంచిర్యాలలో హోలీ వేడుకలు

X
దిశ, మంచిర్యాల టౌన్: మంచిర్యాల పట్టణంలో హోళీ సంబరాలు అంబరాన్ని అంటాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రజలంతా వేడుకలలో పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడిపారు. యువతి యువకులు రంగులతో తడిసి ముద్దయ్యారు. ముఖ్యంగా చిన్నారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మంచిర్యాల కలెక్టర్ నివాసం యందు జరిగిన హోళీ వేడుకలలో కలెక్టర్ దంపతులు పాల్గొని హోళీ ఆడారు. జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు, క్యాంప్ కార్యాలయ సిబ్బంది కలెక్టర్ కు హోళీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలో మార్వడీ, వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోళీ వేడుకల్లో పట్టణ వాసులు పాల్గొని రంగులతో హోళీ ఆడుతూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
Next Story